'లోక్ అదాలత్ ను విజయవంతం చెయ్యండి'

653చూసినవారు
'లోక్ అదాలత్ ను విజయవంతం చెయ్యండి'
ఈ నెల 12 వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షి దారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సిద్దవటం జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస కళ్యాణ్ తెలిపారు. సిద్దవటం కోర్టు నందు సోమవారం అయన మాట్లాడుతూ.. సిద్దవటం, అట్లూరు, ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ ల పరిధిలోని అన్ని సివిల్ క్రిమినల్ కేసులను ఈ లోక్ అదాలత్ నందు పరిష్కరించుకొనే అవకాశం ఉంటుందన్నారు. కావున కక్షి దారులందరూ తమ తమ కేసులను పరిష్కరించుకొని రాజీ పడి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరగకుండా విలువైన సమయాన్ని, అనవసర ధన వ్యయాన్ని ఆదాచేసుకోవాలని అయన కోరారు. కక్షి దారులు వివరాల కోసం సిద్దవటం కోర్టు నందు సంప్రదించాలని అయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్