సిద్ధవటం మండలం మూలపల్లి గ్రామపంచాయతీ పెన్నా నది ఒడ్డున వెలసిన అయ్యవారు రెడ్డి స్వామికి మంగళవారం ఘనంగా పూజలు జరిగాయి. హాజరైన భక్తులు పెన్నా నదిలో స్నానమాడి తొలుత నిత్య పూజ స్వామి కి పెన్నా నది నుండి నమస్కారం చేసి అయ్యవారు రెడ్డి స్వామికి తలనీలాలు సమర్పించి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అయ్యవారు రెడ్డి ఆశీర్వాదంతో ఆవాలు బియ్యం తిన్నచో సకల దీర్ఘకాలిక వ్యాధులు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు నిర్వహించారు.