జ్యోతి ఆలయంలో ఉత్సవ మూర్తులకు కళ్యాణ మహోత్సవం

1358చూసినవారు
జ్యోతి ఆలయంలో ఉత్సవ మూర్తులకు కళ్యాణ మహోత్సవం
సిద్దవటం మండలంలోని జ్యోతి సిద్దవటేశ్వర స్వామి ఆలయంలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవ మూర్తులకు కళ్యాణమహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు శ్రీశైలం దేవస్థానం వేద పండితులు తెలిపారు. మండలంలోని జ్యోతి గ్రామంలో పెన్నానది ఒడ్డున వెలసిన జ్యోతి సిద్దవటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం లోకాకళ్యాణార్థం కోసం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవ మూర్తులకు కళ్యాణమహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జ్యోతి సిద్దవటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం జరిపి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జ్యోతిలో కళ్యాణం నిర్వహించిన అనంతరం శ్రీశైల దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోస్తవాలను నిర్వహిస్తామని వారు తెలిపారు. కళ్యాణ మహోత్సవానికి పరిసర ప్రాంతాల ప్రజలు తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని చూసి తరించాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్