పుల్లంపేట మండలంలో నిరుపేద యానాదులకు భూములు పంచకుండా అధికారులు వారి కడుపులు కొట్టారని బికేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పండుగోల మణి ఆవేదన వ్యక్తం చేశారు. రంగంపల్లి పంచాయతీ సర్వే నెంబర్ 585లో ఉన్న 100 ఎకరాలు ప్రభుత్వ బంజరు భూములను రాచపల్లి ఎస్టీలకు ఇవ్వాలని రాజంపేట సబ్ కలెక్టర్ నిధియా దేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేద యానాదులను గుర్తించాలని కోరారు.