రిటైర్డ్ ఉద్యోగి దేశవ్యాప్త పర్యటన

5657చూసినవారు
రిటైర్డ్ ఉద్యోగి దేశవ్యాప్త పర్యటన
పర్యావరణ పరిరక్షణ కోసం నీటిని ఆదా చేయండని హర్యానా రాష్ట్రానికి చెందిన ఒక రిటైర్డ్ ఉద్యోగి సుభాష్ చంద్రశేఖర్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు తిరుగుతూ శుక్రవారం రాజంపేటకు విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి రాజంపేట లయన్స్ క్లబ్ సభ్యులు తరపున శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. రాజంపేట లయన్స్ క్లబ్ సభ్యులు జిల్లా చైర్మన్ పోతుగుంట రమేష్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నాసర్, లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు షేక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. వారు హర్యానా నుండి పంజాబ్ మీదగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, తెలంగాణ నుండి ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తూ రాజంపేటకు చేరుకోవడం జరిగిందన్నారు.

వారు ఇప్పటివరకు మొత్తం సుమారు 10 వేల కిలోమీటర్లకు పైగా ఈ యాత్ర చేసినారు. ఇంకా తక్కిన రాష్ట్రాలు కూడా తను ప్రయాణం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని దృఢ సంకల్పంతో చేస్తున్న ఈ యాత్ర అందరికీ స్ఫూర్తిదాయకమని వారిని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్