రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలని రాజంపేట జిల్లా సాధన సమితి రిలే నిరాహార దీక్షలో జనసేన మహిళ పోలిశెట్టి రజిత పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాజంపేట జిల్లా కేంద్రం కోసం పోరాడితే జనసేన పార్టీ నాయకులపై కేసులు పెట్టడం దారుణం, ఏ పార్టీ అయినా రాజంపేట జిల్లాకేంద్ర సాధన కోసమే పోరాడుతున్నామన్నారు. జనసేన నాయకులు మీద కక్షపూరితంగా కేసులు పెట్టే విధంగా ఉంది. జనసేన నాయకులు వ్యక్తిగతంగా ఏది పోరాడటం లేదు. ప్రజాస్వామ్యం కోసం రాజంపేట కేంద్రం కోసం పోరాడుతుంటే వ్యక్తిగతంగా కేసులు పెట్టడం దారుణమని పోలిశెట్టి రజిత అన్నారు.