ముగ్గు రాళ్ళ కుప్పకింద మృతదేహం లభ్యం

56చూసినవారు
ముగ్గు రాళ్ళ కుప్పకింద మృతదేహం లభ్యం
ఓబులవారిపల్లి మండలం కొర్లకుంట గ్రామం నుండి చలం పాలెం వెళ్లే దారిలో ముగ్గు రాళ్ళ కుప్ప కింద మంగంపేట ఎస్ టి కాలనీకి చెందిన వెలుగు రాజేంద్ర (35) శవాన్ని కనుగొన్నారు. ఇతనికి భార్య జ్యోతి, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. రాజేంద్ర శనివారం ఉదయం తెల్లవారుజామున వేటకు వెళుతున్నానని ఇంట్లో భార్యకు చెప్పి వెళ్లినట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్