రాయచోటి మండలం కొత్తపల్లికి చెందిన షేక్ మహ్మద్ తాహిర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. వైద్యం కోసం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, ఆయన చొరవతో ₹4 లక్షలు మంజూరయ్యాయి. ఎల్‌వోసీ మంజూరు పత్రాన్ని గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి లబ్ధిదారుడి తండ్రికి అందజేశారు. వైద్య సేవలకు ముందస్తుగా ఆర్థిక సాయం అందించినందుకు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.