బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నదులు వాగులు వర్షాల కారణంగా ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రజలు దాటరాదనీ ముఖ్యంగా పిల్లలను వెళ్లనివ్వకుండా ఉండాలని కోరారు. పాడుబడిన ఇండ్ల వద్ద మరియు విధ్యుత్ స్తంబాల వద్ద ఉండరాడని, అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దని సూచించారు.