వీరభద్ర ఆలయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

279చూసినవారు
వీరభద్ర ఆలయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
రాయచోటి పట్టణ పరిధిలోని శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం నందు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ భవానిదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి దర్శించుకొన్నారు. ఆలయానికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి కి ఆలయ చైర్మన్ పోలంరెడ్డి విజయ, ఈఓ రమణా రెడ్డి ల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అర్చక స్వాములు తీర్ధప్రసాదాలు అందజేసి శాలువా తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో ఆలయ పాలకమండలి సభ్యులు నాగభూషణం, సురేష్ కుమార్, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు పబ్బిశెట్టి సురేష్, ఆసీఫ్ అలీఖాన్, బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్