రాయచోటి మండల పరిధిలోని కాటిమాయకుంట మాధవరం గ్రామాలకు సరిహద్దు ప్రాంతంలో గల దేవరగుట్ట సమీపంలో ఈ నెల 22వ తేదీన జరిగిన నాటు తుపాకీ కాల్పుల ఘటనకు పాల్పడిన ముద్దాయి ముడి రమణప్ప నాయుడు అనే వ్యక్తిని శుక్రవారం రాయచోటి అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసారు. అతని వద్ద నుండి ఒక నాటు తుపాకీతో పాటు 130 గ్రాముల బరువు గల నల్లమందు, మూడు వేర్వేరు పరిమాణం గల నాటు తుపాకీలో ఉపయోగించే 129 సీసం గుండ్లు స్వాధీనం చేసుకున్నారు.