అన్నమయ్య జిల్లాలోని 111 మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో డ్రా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ లాటరీ డ్రా ద్వారా నెంబర్ వారీగా మద్యం దుకాణాలు కేటాయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.