భారీ వర్షాలు, ఏలేరు వరద కారణంగా దెబ్బతిన్న గృహాలు, వ్యవసాయ, ఉద్యాన పంటల గణన ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షణ్మోహన్. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి భారీ వర్షాలు, ఏలేరు ప్రాజెక్టు ప్రభావిత మండలాల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.