భారీ వర్షాలు, సుద్దగడ్డ, ఏలేరు వరదలు కారణంగా నీట మునిగి నాశనం అయిన పంటలను రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేయాలని, పంట నష్టాలను అంచనా వేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కోరారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తంగా పంటలు నీటమునిగి రైతులు నష్టపోయారని తెలిపారు. ఈ క్రాఫ్ బుకింగ్ చేయడం ద్వారా రైతులకు పంట బీమా లభిస్తుందని అధికారులు గుర్తించాలన్నారు.