కాపు బలిజ సంక్షేమసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ గా గొల్లప్రోలు పట్టణానికి చెందిన వ్యాపారవేత్త గొల్లపల్లి తాతాజీ (పెదబాబీ)నియమితులయ్యారు. ఈ మేరకు సేనవ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాపు బలిజ సంక్షేమం కోసం పాటుపడతానని పెదబాబీ తెలియజేశారు. రాష్ట్ర సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆదేశాల మేరకు పనిచేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.