పాఠశాల తెరిచిన రోజునే విద్యార్థులకు కిట్లు పంపిణీ

62చూసినవారు
పాఠశాల తెరిచిన రోజునే విద్యార్థులకు కిట్లు పంపిణీ
వేసవి సెలవులానంతరం పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బ్యాగు, ఏకరూప దుస్తులు, బూట్లు, ఇతర సామగ్రి అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఎస్ఏ సీఎంవో, ఈ కో-ఆర్డినేటర్ చామంతి నాగేశ్వరరావు తెలిపారు. గొల్లప్రోలు ఎంఈవో కార్యాలయాన్ని సోమవారం ఆయన తనిఖీ చేసి సిబ్బందితో సమీక్షించారు. గొల్లప్రోలు మండలంలో 41 పాఠశాలల్లో 4, 682 మంది విద్యార్థులకు కిట్లు అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్