పిఠాపురం: పవన్ కళ్యాణ్‌పై మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యలు అవమానపర్చేలా ఉన్నాయని ఆయన అన్నారు. 'ఏదైనా ఉంటే కేబినెట్లో మాట్లాడుకోవాలి కానీ ఏదో చిన్న పిల్లల్లాగా మాట్లాడటం కరెక్ట్ కాదు. దళిత మాదిగ వర్గానికి చెందిన మహిళ హోం మంత్రిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో మూడు రిజర్వ్డ్ స్థానాలను తీసుకున్న పవన్.. ఒక్క మాదిగ వర్గ నేతకు టిక్కెట్ ఇవ్వలేదు' అని విమర్శించారు.