పిఠాపురం: పవన్ కళ్యాణ్ పై అఘోరి మాత ఆసక్తికర వ్యాఖ్యలు
పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి కలుస్తానని అఘోరి మాతా పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను సందర్శిస్తున్న అఘోరీ, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడని, ఆయన కుటుంబానికి అశీస్సులు అందిస్తున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్ కు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని, వారు పిలిస్తే వెళ్లి కలవడానికి ప్రయత్నిస్తానని, తనంతట తాను స్వయంగా వెళ్లి కలవనని అఘోరీ స్పష్టం చేశారు.