ఆకట్టుకున్న అంబేద్కర్ జీవిత చరిత్ర నృత్యం

78చూసినవారు
ఆకట్టుకున్న అంబేద్కర్ జీవిత చరిత్ర నృత్యం
ప్రత్తిపాడు ఉషోదయ యూత్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక అంబేద్కర్ పార్క్ లో అంబేద్కర్ జయంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అభ్యుదయ కళా నాట్యమండలి వారు ప్రదర్శించిన అంబేద్కర్ జీవితచరిత్రపై నృత్య కళా రూపకం అందరినీ ఆకట్టుకుంది. అంబేద్కర్ వేషదారులు గోపి, జగ్గబాబుల ప్రదర్శన విశేషంగా చూపరులను రంజింప చేసింది. ఈ సందర్భంగా వారిని సర్పంచ్ గుడాల వెంకటరత్నం యుటీఎఫ్, సీఐటీయు నాయకులు సత్కరించారు.

సంబంధిత పోస్ట్