తాండవ రిజర్వాయర్లో నీటిమట్టం పెరగడంతో నీటిని దిగువకు వదులుతున్నట్లు డీఈ అనురాధ తెలిపారు. ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయంలో నీటిమట్టం గణనీయంగా పెరిగిందన్నారు. గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 378. 1 అడుగులకు చేరిందని దీంతో 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని డీఈ ఆదివారం మీడియాకు తెలిపారు. తాండవ నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే యనమల దివ్య కోరారు.