AP: కాపు వర్గానికి కూటమి పెద్దపీట వేస్తుందని పొలిటికల్ సర్కిల్‌లో ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. బీజేపీ నుంచి సోము వీర్రాజు, జనసేన నుంచి కొణిదెల నాగబాబుకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. ఇప్పుడు టీడీపీ నుంచి కాపు సామాజిక నేత వంగవీటి రాధాకు కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే గుడ్ న్యూస్ వింటామని తన మద్దతుదారులకు రాధా చెప్పినట్లు సమాచారం. దాంతో రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా? నామినేటెడ్ పదవి కట్టబెడతారా? వేచి చూడాలి.