ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ మళ్ల రామ్‌గోపాల్ నాయుడిని కీర్తిచక్ర పురస్కారం వరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయనను ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి ఎంపిక చేసింది. ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. కాగా ఈ ఏడాది ఈ పురస్కారానికి నలుగురిని కేంద్రం ఎంపిక చేసింది. అయితే ఈ నలుగురిలో సజీవంగా వున్నది రామ్‌గోపాల్ నాయుడు మాత్రమే.