టీడీపీ మీద ధిక్కార స్వరం వినిపించి ఎన్నికలకు ముందు కేశినేని నాని వైసీపీలో చేరి సొంత తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో ఓడిపోయారు. తాజాగా కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆమె రాజకీయ జీవితం టీడీపీతోనే మొదలైందని, ఎంతో భవిష్యత్తు ఆమెకు ఉన్న రీత్యా టీడీపీ జెండాను ఆమె తిరిగి పట్టుకుంటారని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.