బంగ్లాదేశ్‌లో ఉగ్రాదాడులు జరిగే అవకాశం ఉందని బ్రిటన్ హెచ్చరికలు జారీచేసింది. అక్కడ మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని, ఈ కారణంగానే జన సమ్మర్ధ ప్రాంతాలు, విదేశీయులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాలు, ప్రార్థనా స్థలాల వద్ద ఉగ్రదాడులకు ఆస్కారం ఉందని యూకే హెచ్చరించింది. ఇటీవల ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయి అరెస్టు చేయడంతో.. ఆ దేశంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. జాగ్రత్తగా ఉండాలంటూ తమ పౌరులకు యూకే హెచ్చరికలు జారీ చేసింది.