కొత్తిమీర తినడం వల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. శరీరానికి మంచి నిగారింపును ఇవ్వడానికి, చర్మంపై ముడతలను తొలగించడానికి బాగా తోడ్పడుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. తద్వారా గుండెజబ్బులను అరికడుతుంది. కొత్తిమీర కిడ్నీ సమస్యలను కూడా సమర్థంగా ఎదుర్కొనేలా చేస్తుంది.