చిన్న పిల్లలతో పాటు పెద్దవారు కూడా ప్రతిరోజు క్యారెట్ తినడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. అల్సర్లు, గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలకు క్యారెట్ చెక్ పెడుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడే వారు క్యారెట్ తినడం వల్ల రెండు నెలల్లోనే ఆ బాధ నుంచి బయటపడొచ్చు. కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా బాగా పనిచేస్తుంది. శరీరంలోని ఇన్ఫెక్షన్లు తగ్గించేందుకు యాంటీ సెప్టెక్‌గా పనిచేస్తుంది.