AP: శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఈ నెల 5న 16 ఏళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి 3 రోజులైనా బాలిక ఆచూకీ లభించలేదు. దాంతో బాలిక తల్లి శైలజ మనోవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాలిక బంధువులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ధర్నాకు దిగారు. అక్కడ బాలిక తండ్రి జయ రామప్ప ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. బాలికను త్వరలోనే గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.