AP: ఒక పక్క సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి.. మరోపక్క తరుముకొస్తున్న కేసులు.. ఈ కలిసి రాని కాలానికి వాస్తు దోషాలే కారణమని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన తాడేపల్లి ప్యాలెస్‌లో చకచకా వాస్తు దోషాలు సవరిస్తున్నారు. ఆ ఇంటి చుట్టూ ఉన్న ఇనుప కంచెను వాస్తుకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ఇటీవలే దక్షిణ దిశలో కంచె తొలగించగా.. తాజాగా ఈశాన్యంలో మార్పులు చేశారు.