మెడికల్ పెన్షన్లకు 374 మంది మాత్రమే అర్హులని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ శుక్రవారం తెలిపారు. వీరికి నెలకు రూ. 15 వేలు సహాయం అందిస్తామన్నారు. ఈ జాబితాలో ఇంత వరకు జిల్లాలో మొత్తం 655 మంది పెన్షన్లు పొందారన్నారు. దీనిపై విచారణ జరిపించగా మెడికల్ పెన్షన్లకు 281 మంది అనర్హులుగా నిర్ధారణ జరిగిందన్నారు. వారిలో 255 మంది దివ్యాంగ పెన్షన్లకు అర్హులని, 26 మంది ఏ విధమైన పెన్షన్లకు అర్హులు కాదన్నారు.