ఆహారాన్వేషణలో భాగంగా సంచరిస్తున్న త్రాచుపాము పొరపాటున చేపల వలలో చిక్కుకుంది. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం, ఓడలరేవు గ్రామం, మరిడమ్మ సెంటర్ కు చెందిన చిలకలపూడి రాజు ఇంటి సమీపంలో ఒక త్రాచుపాము గత కొన్ని సంవత్సరాలుగా సంచరిస్తుంది. వలలో చిక్కుకొని వున్న పాముని చూసిన స్థానికులు ఆదివారం స్నేక్ క్యాచర్ వర్మ కు సమాచారం ఇవ్వగా ఆయన ఆ పామును సురక్షత ప్రాంతానికి తరలించారు.