కడపలో జరిగిన రాష్ట్రస్థాయి బాలికల విభాగం కరాటే పోటీల్లో అమలాపురం జూనియర్ కళాశాల విద్యార్థి వేద సంహిత రాష్ట్రంలో రెండవ స్థానం సాధించింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కరాటం సూరిబాబు బుధవారం తెలిపారు. రాష్ట్రంలో రెండవ స్థానం సాధించి సిల్వర్ మెడల్ గెలుచుకున్న వేద సంహితను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాంబాబు, డైరెక్టర్లు నాయుడు, కిరణ్, సతీష్ ఘనంగా సత్కరించి అభినందించారు.