ఈనెల 15వ తేదీ ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని అమలాపురంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త కన్నయ్య తెలిపారు. అమలాపురం మండలం అమలాపురంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకులు నల్లా పవన్ కుమార్ ప్రోత్సాహంతో అమలాపురం గడియార స్తంభం వద్ద ఈ కార్య క్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.