అమలాపురం: వాలంటీర్ ను హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలి

84చూసినవారు
అయినవిల్లి మండలం అయినవిల్లి గ్రామానికి చెందిన వాలంటీర్ దుర్గప్రసాద్ ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అమలాపురంలో కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. హత్య చేసిన రెండేళ్లు గడిచినా నిందితులను అరెస్టు చేయకపోవడం దారుణమని దుర్గ ప్రసాద్ భార్య సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసును పట్టించుకోవట్లేదన్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్