అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో 24. 7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు గురువారం తెలిపారు. జిల్లాలోని మలికిపురం మండలంలో అత్యధికంగా 57. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. అదేవిధంగా కపిలేశ్వరపురం మండలంలో అత్యల్పంగా 6. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు.