అల్లవరం మండలంలో త్వరలో జరగనున్న ఉపాధిహామీ పథకం సామాజిక తనిఖీ కార్యక్రమానికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు అన్ని రికార్డులు సిద్ధం చేయాలని ఎంపీడీవో కృష్ణమోహన్ ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సామాజిక తనిఖీ కార్యక్రమానికి కావాల్సిన అన్ని నివేదికలను సిద్ధం చేసుకోవాలన్నారు.