ప్రణాళికలను అందించాలి: కలెక్టర్ మహేష్ కుమార్

77చూసినవారు
స్వర్ణాంధ్ర - 2047 సాధన కోసం మండల స్థాయి ప్రణాళికలను అందించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. వంద రోజులు, వార్షిక, ఐదేళ్ల ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలన్నారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి నీరభ్ కుమార్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ కు ఆయన అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. వచ్చేనెల 15వ తేదీలోగా నివేదికలను అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్