ఉప్పలగుప్తం: అధికారుల గైర్హాజరుపై జడ్పీటీసీ ఆగ్రహం

75చూసినవారు
ఉప్పలగుప్తం మండల పరిషత్ సమావేశానికి అధికారులు రాకుండా కింది స్థాయి సిబ్బందిని పంపించడంపై జడ్పీటీసీ సభ్యుడు గెడ్డం సంపదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ దంగేటి వీర అచ్యుత జానకి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ప్రజా సమస్యలు ప్రస్తావనకు వచ్చే మండల పరిషత్ సమావేశానికి మండల స్థాయి అధికారులు కాకుండా కింది స్థాయి సిబ్బందిని పంపించడం ఎంత వరకు సమంజసమని జడ్పీటీసీ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్