టీడీపీ కార్యకర్తల కృషితో నియెజకవర్గంలో తెదేపా సభ్యత్వ నమోదులో 50వేలు మైలు రాయి దాటిందని టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి అన్నారు. అనపర్తి ఎస్ఎన్ఆర్ కల్యాణమండపంలో బుధవారం ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులను ఘనంగా సత్కరించారు. అనంతరం కేకును కోసి పార్టీ శ్రేణులకు తినిపించారు. బుడగలను ఎగరవేశారు.