అనపర్తి మండలం రామవరంలో తారాజువ్వ పడి తాటాకు ఇల్లు దగ్ధమైన ఘటన శనివారం జరిగింది. గ్రామానికి చెందిన నల్లమిల్లి లక్ష్మీకాంతం అనే మహిళ గతంలో ఇంట్లో నివాసం ఉండేది. అయితే ఆమె మృతి చెందడంతో ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ ఉండడం లేదు. ఓ వివాహ వేడుకల్లో భాగంగా తారాజువ్వ పడడంతో పైకప్పుకు నిప్పంటుకుంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక అధికారులు మంటలు అదుపు చేశారు. రూ. 20వేలు ఆస్తి నష్టం ఉంటుందని అధికారులు చెప్పారు.