సామాన్యులకు, కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో కానేడు బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో పరిశ్రమ యాజమాన్యం, కార్మికులతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం చర్చలు జరిపారు. గురువారం మరోసారి చర్చించి కార్మికులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. తమ ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందన్నారు.