కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన స్వచ్ఛ సంకల్పంతో గ్రామీణ ప్రాంతాల్లోని డ్రైనేజీలకు మోక్షం లభిస్తోందని గురువారం స్థానికులు చెప్పారు. పుట్టకొండ గ్రామంలో సర్పంచ్ వల్లు వెంకటరమణ ఆధ్వర్యంలో డ్రైనేజీల్లో పూడికతీత, చెత్త తొలగింపు పనులు గురువారం చేపట్టారు. ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి కొండలరావు తెలిపారు.