అనపర్తి టీటీడీ కల్యాణ మండపంలో శ్రీ శారద సంగీత కళా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 26వ త్యాగరాజ ఆదివారం మహాకవి అవధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ ఆధ్యాత్మిక ప్రవచనం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా ఆంధ్ర మహాభాగవతం నుంచి ముఖ్య ఘట్టాలను కళ్ళకు కట్టినట్టు ఆయన వివరిస్తూ ప్రవచనం చెప్పారు. గ్రామానికి చెందిన తిలక్ కుమార్, వివిఆర్ సుబ్రహ్మణ్యం సౌజన్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.