వ్యాయామ సామాగ్రితో వినాయక ప్రతిమ

54చూసినవారు
వ్యాయామ సామాగ్రితో వినాయక ప్రతిమ
తనలోని భక్తిభావానికి సృజనాత్మకతను జోడించి సకల దేవతా స్వరూపుడిగా పూజలందుకునే గణపతి స్వరూపాన్ని వినూత్నంగా తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు విశాఖజిల్లా గాజువాక అగనంపూడిలోని ఆర్కె షేప్ ఫిట్నెస్ జిమ్ నిర్వాహకుడు బర్ల రవికుమార్ యాదవ్. వ్యాయామ సామాగ్రితో ఏర్పాటు చేసి వినాయకుడే వ్యాయామశాలకు వలస వచ్చారా అన్నట్లుగా అత్యద్భుతంగా రూపొందించారు. శనివారం వినాయక చవితి సందర్భంగా పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్