ప్రభుత్వ భవనాల నిర్మాణంలో నాణ్యత లోపాలంటూ ఆరోపణ

76చూసినవారు
పి. గన్నవరం మండలంలోని ఆర్. ఏనుగుపల్లి గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మాణాలు నాణ్యత లోపాలతో నిర్వహించారని టీడీపీ నాయకులు చీకట్ల అర్జునరావు, రామకృష్ణ బుధవారం ఆరోపించారు. వారు మండల పంచాయతీరాజ్ జేఈ ఆనంద్ కు దీనిపై వారు ఫిర్యాదు చేయగా ఆయన సమక్షంలో భవనాల పునాదిని తవ్వి నల్ల మట్టిని పరిశీలించారు. నల్ల మట్టి వలన పునాది దిగబడి పోయే అవకాశం ఉందని తెదేపా నాయకులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్