మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శ్రావణ శనివారం సందర్భంగా భక్తజన కోలాహలంతో కిటకిటలాడింది. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. గోవిందా. గోవిందా. అంటూ స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని తన్మయత్వం చెందారు. అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవతో పాటు ప్రత్యేక పూజలు ఘనంగా జరిపించారు.