గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన ఎమ్మెల్యే

65చూసినవారు
పి. గన్నవరం మండలంలోని గంటి పెదపూడి లంక గ్రామం వద్ద గోదావరి వరద ఉద్ధృతిని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్య నారాయణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందించాల్సిన సహాయక చర్యలపై ఆయన సీఐ ప్రశాంత్ కుమార్, స్థానిక అధికారులతో చర్చించారు. పడవలపై ప్రయాణించేటప్పుడు ప్రయాణికులందరూ తప్పనిసరి లైఫ్ జాకెట్ ధరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రిజ్వీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్