గోపాలపురం: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ

50చూసినవారు
గోపాలపురం: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ
ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఎస్ఐ సతీష్ అన్నారు. చిట్యాల ఎస్బీఐ బ్యాంకులో సైబర్ నేరాలపై సోమవారం అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైనట్లయితే తక్షణమే తమకు తెలియజేయాలని కోరారు. 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు. అనధికార లింకులు క్లిక్ చేసి విలువైన సమాచారం, బ్యాంకు ఖాతాల్లోని నగదును పోగొట్టుకోవద్దన్నారు.

సంబంధిత పోస్ట్