వామన అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న చిన్న వెంకన్న

54చూసినవారు
వామన అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న చిన్న వెంకన్న
ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4 వ రోజు స్వామివారు వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు హనుమద్ వాహనంపై విహరించారు. హనుమద్ వాహనంపై స్వామి,అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఉంచి ప్రత్యేక పూలతో అలంకరించారు.అర్చకులు హారతులు పట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు.హనుమద్ వాహనంపై శ్రీదేవి భూదేవి సమీత శ్రీనివాసుడు ద్వారకాతిరుమల పురవీధులలో విహరించారు.

సంబంధిత పోస్ట్