గోపాలపురంలో రోడ్డు ప్రమాదం

76చూసినవారు
గోపాలపురం జంక్షన్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం బైకు మీద వెళుతున్న వ్యక్తిని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు మీద ఉన్న వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్