గోపాలపురం: ఈ నెల 12 నుంచి రెవెన్యూ సదస్సులు
భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని గోపాలపురం తహశీల్దార్ అజయ్ బాబు సోమవారం పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 12 నుంచి జనవరి 7వ తేదీ వరకు గోపాలపురం మండల వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 19 గ్రామ పంచాయతీల్లోనూ ఈ సదస్సులు జరుగుతాయన్నారు. ప్రజలు ఇచ్చిన అర్జీలకు రసీదులు ఇచ్చి, సంబంధిత పోర్టలో సమస్యను అప్లోడ్ చేస్తామన్నారు.